Tesla: బెంగళూరులో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభించిన టెస్లా

by S Gopi |

ఇప్పటికే ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లాకు ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ దేశంలో నాలుగవది.

Tesla: బెంగళూరులో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభించిన టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా దేశీయ మార్కెట్‌లో మరింత వేగంగా విస్తరణ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం బెంగళూరులో కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్డులోని వీఆర్ బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈ సెంటర్, కస్టమర్లకు టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను లైవ్‌లో చూసేందుకు అవకాశం కల్పించడంతో పాటు, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్‌ను కూడా అందిస్తుంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లాకు ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ దేశంలో నాలుగవది. ఈ సెంటర్‌లో కస్టమర్లు టెస్లా మోడల్ వై, కొత్తగా విడుదలైన టెస్లా మోడల్ వైఎల్ ఎస్‌యూవీలను చూడవచ్చు. మోడల్ వైఎల్ ఎస్‌యూవీని టెస్లా గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 83 కిలోవాట్ అవర్ బ్యాటరీతో లభించే ఈ కారు 250 కిలోవాట్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 288 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. పూర్తి ఛార్జ్‌తో 681 కిలోమీటర్ల రేంజ్‌ని కవర్ చేస్తుందని, కేవలం ఐదు సెకన్లలో సున్నా నుండి గంటకు 100 కి.మీ స్పీడ్‌ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.

Next Story