- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tesla India: భారత్‌లో టెస్లా మోడల్ వై విడుదల.. ధర రూ. 60 లక్షలు
భారత మార్కెట్లోకి వచ్చే మొదటి టెస్లా రెండు వేరియంట్లలో లభిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. మంగళవారం కంపెనీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పేరుతో దేశంలోని ప్రధాన నగరాల్లో కంపెనీ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. అందులో ముంబై షోరూమ్ మొదటిది, త్వరలో దేశ రాజధాని న్యూఢిల్లీలో మరొక ఔట్‌లెట్ ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని సమాచారం. చాలాకాలంగా ఎదురుచూస్తున్న టెస్లా ఎంట్రీతో కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'మోడల్ వై'కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టెస్లా ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, భారత మార్కెట్లోకి వచ్చే మొదటి టెస్లా రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈవీ కారు మోడల్ వై రియర్-వీల్ డ్రైవ్(ఆర్‌డబ్ల్యూడీ) ధర ముంబైలో రూ. 59.89 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ ధర రూ. 67.89 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. మోడల్ వై గరిష్ఠంగా 201 కి.మీ వేగంతో ప్రయాణించగలదు, కేవలం 5.9 సెకన్లలో 100 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఈ కారు 500 కి.మీ. ప్రయాణిస్తుంది. భారత మార్కెట్ కోసం టెస్లా మోడల్ వై ఆరు రంగుల్లో లభిస్తుంది. వైట్, బ్లాక్ ఇంటీరియర్‌తో స్టెల్త్ గ్రే, పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, అల్ట్రా రెడ్, క్విక్ సిల్వర్ ఉన్నాయి. కారు ధర రంగును బట్టి మారుతుంది.
మోడల్ వై గురించి
భారత మార్కెట్ కోసం మోడల్ వైలో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను టెస్లా అందిస్తోంది. ఈ కారు ప్రీమియం ఇంటీరియర్, 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్ కమాండ్ హబ్‌గా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, వివిధ యూఎస్‌బీ-సీ పోర్ట్‌లు, వాయిస్-యాక్టివేటెడ్ కంట్రోల్స్, యాప్-ఆధారిత వెహికల్ యాక్సెస్ వంటి టెస్లా సిగ్నేచర్ టెక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.






