- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tesla: టెస్లా ఇండియా కంట్రీ హెడ్ పదవికి ప్రశాంత్ మీనన్ రాజీనామా
వ్యక్తికత కారణాల వల్లనే బాధ్యతల నంచి తప్పుకుంటున్నట్టు ప్రశాంత్ మీనాన్ పేర్కొన్నట్టు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న కంపెనీలో వేళ కీలక పరిణామాం చోటుచేసుకుంది. సుమారు తొమ్మిది సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్న టెస్లా కంట్రీ హెడ్ ప్రశాంత్ మీనన్ రాజీనామా చేశారు. గత నాలుగేళ్లుగా ప్రశాంత్ మీనన్ టెస్లా ఇండియా హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ గురువారం వెలువరించిన కథనంలో పేర్కొంది. ముంబై, ఢిల్లీల్లో కంపెనీ తన మొదటి స్టోర్లను ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న సమయంలో ప్రశాంత్ మీనన్ రాజీనామా చేయడం గమనార్హం. వ్యక్తికత కారణాల వల్లనే బాధ్యతల నంచి తప్పుకుంటున్నట్టు ప్రశాంత్ మీనాన్ పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని టెస్లా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ బోర్డు ఛైర్మన్‌గా ప్రశాంత్ మీనన్ కంపెనీ భారత మార్కెట్లో అడుగు పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పూణెలో స్థానిక ఆఫీసును ఏర్పాటు చేయడం, కంపెనీ షోరూమ్ కోసం స్థలాన్ని లీజుకు తీసుకోవడం వంటి కీలక పనులన్నీ అతని హయాంలోనే జరిగాయి. ప్రశాంత్ రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి ఆ స్థానంలో కంపెనీ ఎవరినీ నియమించలేదు. భారత్‌లోని కార్యకలాపాలను కంపెనీకి చెందిన చైనా బృందం పర్యవేక్షించనున్నాయి. టెస్లా కంట్రీ హెడ్‌గా 2021లో నియామకానికి ముందు ప్రశాంత్ మీనన్ టెస్లా అమెరికాలోని కాస్ట, ప్రాసెస్, రెగ్యులేటరీ డైరెక్టర్ అడ్వైజర్‌గా చేశారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్, ప్రశాంత్ మీనన్‌కు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. టెస్లా కంపెనీ కంటే ముందు వీరిద్దరూ పెన్సిల్వేనియా యూనివర్శిటీలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు.






