- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: మెజారిటీ ఉద్యోగులకు 4.5-7 శాతం జీతాల పెంపును ప్రకటించిన టీసీఎస్
సెప్టెంబర్ నుంచి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయని లేఖలో పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులలో ఎక్కువ మందికి 4.5–7 శాతం వరకు జీతాల పెంపును ప్రకటించినట్లు మంగళవారం కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం నుంచే ఉద్యోగులకు ఇంక్రిమెంట్ లేఖలను పంపడం ప్రారంభించింది. సెప్టెంబర్ నుంచి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయని లేఖలో పేర్కొంది. సీ3ఏ, దానికి సమానమైన గ్రేడ్ ఉన్న మెజారిటీ ఉద్యోగుల జీతాలను సవరిస్తున్నట్టు కంపెనీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది. అయితే, ఈ పెంపు ఇటీవలి సంవత్సరాలలోనే అత్యల్పం కావడం గమనార్హం. ఇది టీసీఎస్‌తో పాటు మొత్తం ఐటీ రంగంలో ఉన్న ఆర్థిక పనితీరును ప్రభావితం చేసే సవాళ్లు, వ్యాపార ధోరణిని ప్రతిబింబిస్తుంది. టీసీఎస్ అంతకుముందు 2022-23లో 6-9 శాతం, 2021-22లో 10.5 శాతం పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారీగా 2 శాతానికి సమానమైన 12,000 మందిని తొలగిస్తూ టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోపు 12,261 మందిని తొలగించాలని నిర్ణయించినట్టు, అందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని టీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఏఐ టెక్నాలజీ కారణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.






