TCS: ఈ ఏడాది 25 వేల ఫ్రెషర్ల నియామకం

by S Gopi |

గత 2025-26లోనూ టీసీఎస్ పరిశ్రమలో ఎన్ని సమస్యలున్నా 44 వేల మంది వరకు ఫ్రెషర్లను నియమించింది.

TCS: ఈ ఏడాది 25 వేల ఫ్రెషర్ల నియామకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఫ్రెషర్లను తీసుకుంటామని ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రకటించింది. కార్యకలాపాల్లో ఉన్న డిమాండ్ ఆధారంగా 2026-27లో 25,000 కంటే ఎక్కువమంది ఫ్రెషర్ల నియామకం జరుగుతుందని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. గత 2025-26లోనూ టీసీఎస్ పరిశ్రమలో ఎన్ని సమస్యలున్నా 44 వేల మంది వరకు ఫ్రెషర్లను నియమించింది. ఇతర కంపెనీలకు చెందిన ఉద్యోగులను తీసుకునే అంశంపై స్పందిస్తూ.. సాధారణంగా ఫ్రెషర్లకు శిక్షణ ఇచ్చి, సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా మారాలంటే తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఇతర కంపెనీల నుంచి వచ్చే ఉద్యోగుల విషయంలో ఈ సమయం అవసరంలేదు. సంస్థ వ్యాపార అవసరాలను బట్టి నియామక ప్రక్రియలో మార్పులు జరుగుతాయి. గడిచిన మూడేళ్లలో కంపెనీ కనీసం 40 వేల కంటే ఎక్కువమందినే ఫ్రెషర్లను నియమించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇటీవల 12 వేల మందిని తొలగించడంపై బదులిస్తూ..సంస్థలో మెరుగైన పనితీరు ఉన్నంత కాలం ఉద్యోగుల కెరీర్‌కు ఇబ్బంది ఉండదు. అయితే, ఇటీవల లేఆఫ్స్‌కు ఏఐతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

Next Story