TCS: మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని సంకేతమిచ్చిన టీసీఎస్

by S Gopi |

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత ఇచ్చింది.

TCS: మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని సంకేతమిచ్చిన టీసీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రానున్న త్రైమాసికంలో మరిన్ని లేఆఫ్‌లు ఉంటాయని సంకేతాలిచ్చింది. గురువారం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత ఇచ్చింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారు 6 వేల మందిని మాత్రమే తొలగించామని వివరణ ఇచ్చింది. సీనియర్, మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలలో మాత్రమే ఈ తొలగింపు జరిగినట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్(నైట్స్) ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి రెండో త్రైమసికం మధ్య కంపెనీ మొత్తం 19,755 మందిని తొలగించినట్టు వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపులకు అనేక అంశాలు కారణమని కంపెనీ చెబుతోంది. మరింత చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా మారాలనే లక్ష్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది.. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)లో కంపెనీకి కొత్త స్కిల్స్ ఉన్న ఉద్యోగులు అవసరం. ఇప్పటికే ఉన్న కొన్ని ఉద్యోగాలు రానున్న రోజుల్లో అవసరం ఉండవు. కొన్ని ఉద్యోగాలకు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి, సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లేఆఫ్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని టీసీఎస్ పేర్కొంది.

Next Story