- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Super Rich: తమపై భారీ పన్నులు విధించాలని కోరిన అత్యంత సంపన్నులు
ఇది దావోస్ కార్యక్రమానికి వచ్చిన వారితో పాటు అంతర్జాతీయంగా అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత ధనవంతులు భవిష్యత్తు అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించేందుకు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) దావోస్ కేంద్రంగా జరుగుతోంది. అయితే, గతంలో కంటే ఈసారి, కొంత భిన్నంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది అత్యంత ధనవంతులు సరికొత్త, ఆశ్చర్యకరమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అదే.. తమపై భారీగా పన్నులు వేయగమని కోరడం. ఇది దావోస్ కార్యక్రమానికి వచ్చిన వారితో పాటు అంతర్జాతీయంగా అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. 24 దేశాలకు ప్రాతినిధ్యం వహించే సంపన్నుల బృందం 'టైమ్ టూ విన్' పేరుతో సంతకాలు చేసిన లేఖను విడుదల చేశారు. సూపర్ రిచ్, మిగిలిన మానవాళి మధ్య పెరుగుతున్న అంతరం వల్ల ప్రపంచ అగాధంలోకి వెళ్తున్నది. ఈ అంతరం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లో సెంటిమెంట్ బలహీనపడుతోంది. దీన్ని తొలగించేందుకు అత్యంత ధనవంతులపై ఎక్కువ పన్నులు విధించాలన్నారు. అత్యధిక సంపద ఉన్న వ్యక్తులు కొందరు ప్రజాస్వామ్యాలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలపై అజమాయిసీ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛ నియంత్రించడం, కొత్త ఆవిష్కరణలపై ఆధిపత్యం కలిగి ఉన్నారని లేఖలో ఆయా సంపన్నులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పటి ప్రజాస్వామ్యాలను తాము ఆశిస్తున్నాం. అందుకోసం అత్యంత సంపన్నులపై పన్నులు విధించాలని, దానివల్ల వారి జీవనంపై ఎలాంటి ప్రభావం ఉండదు. పన్నుల ద్వారా వచ్చిన నిధులను ప్రజారోగ్యం, విద్య కోసం ఖర్చు చేయాలని లేఖలో స్పష్టం చేశారు.






