Tata Group: టాటా టెలీసర్వీసెస్‌కు నిధులు కేటాయించనున్న టాటా గ్రూప్

by S Gopi |

ప్రస్తుతం కంపెనీకి రూ. 19,256 కోట్ల విలువైన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్), ఇతర బకాయిలు ఉన్నాయి.

Tata Group: టాటా టెలీసర్వీసెస్‌కు నిధులు కేటాయించనున్న టాటా గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఉపశమనం కోరినప్పటికీ, సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ తన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ టెలికాం విభాగం టాటా టెలీసర్వీసెస్‌కు మూలధన కేటాయింపులు చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం కంపెనీకి రూ. 19,256 కోట్ల విలువైన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్), ఇతర బకాయిలు ఉన్నాయి. దాదాపు రూ. 18 వేల కోట్ల క్షీణతను ఎదుర్కొంటున్న టాటా టెలీకి ప్రస్తుత పరిస్థితుల్లో సరైన మద్దతు లేకుండా ఏజీఆర్ బకాయిల చెల్లింపులతో పాటు ఇతర కార్యకలాపాలను కొనసాగించడం క్లిష్టంగా మారింది. ఈ కారణంగానే టాటా గ్రూప్ నిధులు సమకూర్చేందుకు కంఫర్ట్ లెటర్ జారీ చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. గణాంకాల ప్రకారం, గత ఏడాది మార్చి నాటికి టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (టీటీఎంఎల్) కింద రూ. 3,367 కోట్లు, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్) కింద రూ. 14,463 కోట్లు బకాయిలు ఉన్నాయి. అప్పటి నుంచి 2025, మార్చి నాటికి రూ. 19,256 కోట్లకు పెరిగాయి.

Next Story