- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tata Motors: టాటా కార్లపై రూ. 1.55 లక్షల వరకు తగ్గింపు
ప్యాసింజర్ వాహనాల ధరలను రూ. 75,000 నుంచి రూ. 1.55 లక్షల వరకు తగ్గించినట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: తాజాగా ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ శుక్రవారం తన వాహనాలపై భారీ తగ్గింపు వివరాలను ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను రూ. 75,000 నుంచి రూ. 1.55 లక్షల వరకు తగ్గించినట్టు తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, టాటా చిన్న కార్లలో టియాగో మోడల్‌పై రూ. 75 వేలు, టిగోర్‌పై రూ. 80 వేలు, ఆల్ట్రోజ్‌పై రూ. 1.10 లక్షలు తగ్గించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పంచ్ కారుపై రూ. 85 వేలు, నెక్సాన్‌పై రూ. 1.55 లక్షలు తగ్గించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో కర్వ్‌పై రూ. 65 వేలు, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో హారియర్‌పై రూ. 1.40 లక్షలు, సఫారీపై రూ. 1.45 లక్షలు తగ్గించింది. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్ విభాగం ఎండీ శైలేష్ చంద్ర వెల్లడించారు.






