- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Motors: వచ్చే ఐదేళ్లలో టాటా మోటార్స్ నుంచి 5 ఈవీలు
వీటిలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రీమియం అవిన్య మోడల్ కూడా ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈవీ విభాగాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం 2030 నాటికి కొత్తగా ఐదు ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపింది. వీటిలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రీమియం అవిన్య మోడల్ కూడా ఉంది. దీని ద్వారా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ ప్యాసింజర్ వాహన విభాగంలో స్థిరంగా 45-50 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ భావిస్తోంది. 2029-2030 మధ్య కాలంలో ఈవీ వ్యాపారంలోకి రూ. 16,000-18,000 కోట్ల పెట్టుబడులు పెడతామని, కొత్త మోడళ్లతో పాటు దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాలను పెంచుతామని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే తాము దేశీయ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఈ విభాగంలోని మొత్తం అమ్మకాల్లో దాదాపు మూడింట రెండు వంతులు అంటే దాదాపు 66 శాతం వాటాతో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోటీ పెరుగుతున్నప్పటికీ, అనుకున్న సమయానికి స్థిరమైన 50 శాతం వరకు వాటాను కొనసాగించగలమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర అన్నారు.






