- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాటా మోటార్స్, ఉబెర్ మధ్య అతిపెద్ద ఈవీ ఒప్పందం!
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈవీ రంగంలోనే భారీ ఒప్పందాన్ని ప్రకటించింది.

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈవీ రంగంలోనే భారీ ఒప్పందాన్ని ప్రకటించింది. రైడింగ్ ప్లాట్‌ఫామ్ ఉబెర్‌కు టాటా సంస్థ ఏకంగా 25,000 ఎక్స్‌ప్రెస్-టీ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను సరఫరా చేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్లను ఉబెర్ కంపెనీ తన ప్రీమియం విభాగం సేవలకు వినియోగించనున్నట్లు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. వీటన్నింటిని హైదరాబాద్ సహా ఢిల్లె-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో వినియోగించనున్నారు.
ఈ నెల నుంచే కార్లను ఉబెర్‌కు సరఫరా చేస్తామని, దేశీయంగా ఈవీల వాడకాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర అన్నారు. ఈ భాగస్వామ్యంతో ఈవీ పరిశ్రమ మరింత పటిష్టంగా మారడంతో పాటు సున్నా ఉద్గారాల లక్ష్యాలను చేరేందుకు వీలవుతుందని ఉబెర్ ఇండియా అధ్యక్షుడు ప్రబ్‌జీత్ సింగ్ తెలిపారు. కాగా, ఇరు సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందం విలువ ఎంతనేది పేర్కొనలేదు.






