Tata Motors: రికార్డు స్థాయిలో టాటా మోటార్స్ 144 పేటెంట్ దరఖాస్తులు

by S Gopi |

ఈ పేటెంట్ దరఖాస్తులు కేవలం ఎక్కువ సంఖ్యలో మాత్రమే కాదు, వాహన రంగంలో ప్రాధాన్యత ఉన్నవేనని కంపెనీ స్పష్టం చేసింది.

Tata Motors: రికార్డు స్థాయిలో టాటా మోటార్స్ 144 పేటెంట్ దరఖాస్తులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆవిష్కరణల విషయంలో కొత్త మైలురాయిని చేరుకుంది. ఒకే సంవత్సరంలో అత్యధికంగా 144 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది సంస్థ ఆర్అండ్‌డీపై పెరుగుతున్న దృష్టి, ఇంజనీరింగ్ బృందాల సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమని కంపెనీ అభిప్రాయపడింది. ఈ పేటెంట్ దరఖాస్తులు కేవలం ఎక్కువ సంఖ్యలో మాత్రమే కాదు, వాహన రంగంలో ప్రాధాన్యత ఉన్నవేనని కంపెనీ స్పష్టం చేసింది. వాహన భద్రత, మెరుగైన పనితీరు, వినియోగదారులకు ఖర్చులను తగ్గించడం, ప్రయాణికుల సౌకర్యం పెంపు వంటి కీలక అంశాలపై ఇవి దృష్టి సారించాయి. మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్-సెంట్రిక్ ఇన్నోవేషన్‌ను పెంచాలని భావిస్తున్నట్టు కంపెనీ ఇంజనీరింగ్ హెడ్ అనిరుధ్ కులకర్ణి చెప్పారు. రికార్డు స్థాయి పేటెంట్ ఫైలింగ్‌లు సంస్థలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకతకు ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత ఇంజిన్‌ల వంటి భవిష్యత్ సాంకేతికతలపై దృష్టి పెట్టడం ద్వారా, టాటా మోటార్స్ వాహన రంగంలో తన బలాన్ని పెంచుకుంటుందని పేర్కొన్నారు.

Next Story