- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Car Prices: పెరుగుతున్న కార్ల ధరలు
మారుతీ సుజుకి కూడా పెంపును సమీక్షిస్తున్నట్టు సమాచారం. కంపెనీలన్నీ సవరించిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త కారు కొనేవారికి తయారీ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తతల కారణంగా ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో, అనేక కార్ల తయారీ సంస్థలు కార్ల ధరలను పెంచాయి. వీటిలో దేశీయ తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌తో పాటు లగ్జరీ కార్ల బ్రాండ్ బీఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్, ఆడి ఇండియా కూడా ఉన్నాయి. మారుతీ సుజుకి కూడా పెంపును సమీక్షిస్తున్నట్టు సమాచారం. కంపెనీలన్నీ సవరించిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి. టాటా మోటార్స్ అన్ని కార్లపైనా 0.5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. రోజురోజుకు పెరుగుతున్న ముడి పదార్థాల ధరలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా కూడా అన్ని కార్లపై 2 శాతం వరకు పెంచుతున్నామని పేర్కొంది. పెరుగుతున్న లాజిస్టిక్స్, మెటీరియల్ ఖర్చులతో పాటు, క్షీణిస్తున్న రూపాయి ప్రభావం వల్ల కూడా పెంపు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇదే బాటలో మెర్సిడెస్-బెంజ్ ఇండియా, ఆడి ఇండియా కూడా వచ్చే నెల నుంచి వాహనాల ధరల పెంపును ప్రకటించాయి. ఎంతమేర పెంచనున్నది ఇంకా స్పష్టం చేయలేదు.






