- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cars Price Hike: ధరలు పెంచిన టాటా మోటార్స్, కియా ఇండియా
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరుగుతాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో కార్ల తయారీ కంపెనీలన్నీ వరుసగా ధరలు పెంచేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికీ చాలా కంపెనీలు పెంపు నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా టాటా మోటార్స్, కియా ఇండియా కూడా ధరలను పెంచనున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించాయి. టాటా మోటార్స్ తన అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి నుంచి 3 శాతం మేర పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరుగుతాయని, కార్ల మోడల్, వేరియంట్‌ని బట్టి పెరిగిన ధరల్లో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పెంపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మరో కంపెనీ కియా ఇండియా కూడా అన్ని మోడళ్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి నుంచి అన్ని కార్ల ధరలను 2 శాతం పెంచుతామని ప్రకటించింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో పాటు సరఫరా వ్యయాం అధికంగా ఉందని, అందుకే కొంతమేర భారం కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్టు కియా ఇండియా పేర్కొంది. ధరలు పెంచినప్పటికీ మెరుగైన నాణ్యతతో కూడిన టెక్ సౌకర్యాలను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ పేర్కొంది.






