- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాటా గ్రూప్ గొప్ప నిర్ణయం.. ఎయిరిండియా ప్రమాద బాధితుల కోసం రూ.500 కోట్ల ట్రస్ట్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు (Air India) చెందిన విమానం కూలిపోయి 275 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు (Air India) చెందిన విమానం కూలిపోయి 275 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. ఈ విమాన దుర్ఘటనను టాటా సంస్థ చాలా సీరియస్‌గా తీసుకొంది. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్ (TATA Sons) గొప్ప నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన మధ్యంతర బోర్డు సమావేశంలో ఈ మేరకు రూ.500 కోట్ల ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ట్రస్ట్ బాధితుల కుటుంబాలకు వైద్య సహాయం, విద్య, ఉద్యోగావకాశాలు తదితర రూపాల్లో మద్దతు అందించనుంది.
ఈ ప్రతిపాదనపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందిస్తూ, బాధితులకు దీర్ఘకాలిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంపెనీ తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గదని, అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాస్తవానికి తొలుత టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ రెండు వేర్వేరు ట్రస్ట్‌లను ఏర్పాటుచేయాలని భావించింది. వీటిల్లో ఒకటి భారతీయ బాధితుల కుటుంబాలను చూసుకొనేందుకు కాగా.. మరొకొటి విదేశీ బాధితుల కుటుంబాల కోసం. ఇక తాజాగా ట్రస్ట్‌కు కేటాయించే సొమ్ముతో మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, సమీపంలో విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు చేపట్టనుంది. మిగిలిన మూల నిధిని బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు తీర్చడానికి వినియోగించాలని భావిస్తున్నారు. త్వరలోనే ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసే అవకాశం ఉంది.






