- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rapido: స్విగ్గీ, జొమాటోలను కలవరపెడుతున్న ర్యాపిడో
ఈ పరిణామాలను రుజువు చేస్తూ ఇటీవల జొమాటో, స్విగ్గీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: చాలా సంవత్సరాలుగా భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలకు గట్టి పోటీ మొదలైంది. ఇదివరకు కొన్ని కంపెనీలు ఈ విభాగంలో అడుగుపెట్టినప్పటికీ, నిలదొక్కుకోలేకపోయాయి. తాజాగా క్యాబ్ సేవల్లో అత్యంత వేగంగా దూసుకోచ్చిన ప్రముఖ ర్యాపిడో ఇటీవల ఫుడ్ డెలివరీ సేవలను కూడా అందించేందుకు సిద్ధమైంది. అయితే, ఇప్పటివరకు స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే కమీషన్ కంటే దాదాపు సగం తగ్గింపుతో డెలివరీ అందించనున్నట్టు ర్యాపిడో ప్రకటించింది. ఈ పరిణామాలను రుజువు చేస్తూ ఇటీవల జొమాటో, స్విగ్గీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ప్రస్తుతం క్యాబ్ సేవలకు పరిమితమైన ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే వివిధ రెస్టారెంట్లతో ఒప్పందం చేసుకుంది. రూ. 400 కంటే తక్కువ విలువైన ఆర్డర్లకు రూ. 25, రూ. 400 పైన ఉండే ఆర్డర్లకు రూ. 50 కమీషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సంస్థలు 15-30 శాతం కమీషన్ తీసుకుంటున్నాయి. కానీ ర్యాపిడో అందులో సగం కంటే తక్కువ 6-12 శాతం మాత్రమే తీసుకోనుంది. జూలై నెల నుంచి ర్యాపిడో బెంగళూరు కేంద్రంగా ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ర్యాపిడో అనుసరించే తక్కువ కమిషన్ విధానంతో తమపై ప్రభావం ఉంటుందని స్విగ్గీ, జొమాటో కలవరుపడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం స్విగ్గీ షేర్ ధర దాదాపు 3 శాతం, జొమాటో 2 శాతం మేర క్షీణించాయి.






