ఒకే వ్యక్తి 12 నెలల్లో రూ. 6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్: SWIGGY!

by Disha Web Desk 17 |
ఒకే వ్యక్తి 12 నెలల్లో రూ. 6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్: SWIGGY!
X

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంలో ఇడ్లీల కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా మార్చి 30న జరిగే 'ప్రపంచ ఇడ్లీ దినోత్సవం' సందర్భంగా స్విగ్గీ ఈ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్రేక్‌ఫాస్ట్ వంటకాల్లో పేరుగాంచిన ఇడ్లీ గురించి స్విగ్గీ మరిన్ని విషయాలను తెలిపింది.

గతేడాది మార్చి 30 నుంచి ఈ ఏడాది మార్చి 30వ తేదీ మధ్య వచ్చిన ఇడ్లీ ఆర్డర్లను పరిశీలించిన స్విగ్గీ గత 12 నెలల్లో మొత్తం 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసినట్లు పేర్కొంది. అత్యధిక ఆర్డర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పూణె, ముంబై, కొచ్చి, కోయంబత్తూర్ నగరాల నుంచి వచ్చాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వినియోగదారుడు ఈ 12 నెలల కాలంలో ఏకంగా రూ. 6 లక్షల విలువైన ఇడ్లీలను అంటే మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేయడం గమనార్హం.


Next Story

Most Viewed