Swiggy: రూ. 99కే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీసెస్

by S Gopi |

ఈ సర్వీసులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరుపతి సహా 175కి పైన నగరాల్లో 99 స్టోర్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Swiggy: రూ. 99కే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీసెస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఫుడ్ డెలివరీ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రముఖ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సరికొత్త సేవలను ప్రారంభించింది. '99 స్టోర్ ' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా దేశంలోని 175కి పైగా నగరాల్లో రూ. 99కే సింగిల్-సర్వ్ మీల్స్ అందించనుంది. తక్కువ ధరకే భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్విగ్గీ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ధరల ఆధారంగా అవసరానికి ఆర్డర్ చేసే కస్టమర్లను, అధిక-ఫ్రీక్వెన్సీ ఉన్న జెన్-జీ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొంది. ప్రత్యేకంగా రూ. 99 ధరకే లభించే సింగిల్ మీల్స్ ఈ ఫీచర్ ద్వారా లభిస్తాయి. ఈ సర్వీసులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, తిరుపతి, సహా 175కి పైన నగరాల్లో 99 స్టోర్ సేవలు అందుబాటులో ఉంటాయి.

'99 స్టోర్ ' సేవల్లో భాగంగా రూ. 99కే అందించే పదార్థాల్లో క్విక్-ప్రిపరేషన్(తక్కువ సమయంలో పూర్తయ్యే) వంటకాలు ఉంటాయి. వీటిని 'ఎకో సేవర్ ' డెలివరీ మోడ్ కింద ఈ ఆర్డర్‌లను ఉచితంగానే డెలివరీ చేయనున్నారు. అందులో రోల్స్, బిర్యనీ, నూడుల్స్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, బర్గర్స్, పిజ్జా, కేక్స్ లాంటి అనేక రకాల వంటకాలను ఈ ఫీచర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. రూ. 99కే అందించాలనే నిర్ణయం కేవలం ఖర్చుకు సంబంధించి కాదని, తమ కస్టమర్లకు విశ్వాసంతో అందించే సేవగా భావిస్తున్నామని స్విగ్గీస్ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ చెప్పారు. దీనికోసం రెస్టారెంట్ పార్టనర్లతో, డెలివరీ విభాగంతో కలిసి పనిచేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Next Story