- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్విగ్గీలో కొత్త కేటగిరీ.. వారికోసమే తెచ్చామని వెల్లడి
పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు.. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో ఇవే టాప్ లో ఉంటాయి. అయితే అందరూ వీటినే ఇష్టపడతారని చెప్పలేం.

దిశ, వెబ్‌డెస్క్: పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు.. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో ఇవే టాప్ లో ఉంటాయి. అయితే అందరూ వీటినే ఇష్టపడతారని చెప్పలేం. జంక్ ఫుడ్ తినేవారే కాదు.. హెల్దీ ఫుడ్ కోరుకునేవారు కూడా ఉంటారు. వారికోసం స్విగ్గీ కొత్త కేటగిరీని తీసుకొచ్చింది. అదే ఈట్ రైట్. ప్రస్తుతం దేశంలో 50 ప్రముఖ నగరాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈట్ రైట్ కేటగిరీలో హై ప్రొటీన్, లో కేలరీలు, షుగర్ లెస్ ఫుడ్స్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 2 లక్షల రెస్టారెంట్లతో టై అప్ అయి.. ఆహార ప్రియుల కోసం ఈట్ రైట్ కేటగిరీని తీసుకొచ్చినట్లు స్విగ్గీ వెల్లడించారు. హెల్త్ ఫ్రీక్స్ కోసం స్పెషల్ గా ఈ కేటగిరీని రూపొందించినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ వెల్లడించారు. హెల్దీ ఫుడ్ ను ఆర్డర్ చేసేవారిలో మెట్రోనగరాల్లో ఉన్నవారికంటే టైర్ -2 నగరాల్లో ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. చండీగడ్, గువాహటి, లుథియానా, భువనేశ్వర్ వంటి నగరాల్లో యూజర్లు హెల్దీ ఫుడ్స్ ఆర్డర్ చేస్తున్నారని వెల్లడించారు.






