- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఎల్పీజీ సిలిండర్లు
దేశంలోనే తొలిసారిగా ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సేవలను బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా క్విక్ కామర్స్ సేవలు మరో కీలక దశలోకి అడుగుపెట్టాయి. ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుని, దేశంలోనే తొలిసారిగా ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ సేవలను బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సేవల ద్వారా వినియోగదారులు ఇన్‌స్టామార్ట్ యాప్‌లోనే హెచ్‌పీసీఎల్ కొత్త 10 కేజీల 'హెచ్‌పీ నవ్య' కాంపోజిట్ సిలిండర్‌తో పాటు 5 కేజీల మెటల్ సిలిండర్‌ను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, అపార్ట్‌మెంట్‌లలో నివశించే చిన్న కుటుంబాలు, ఉద్యోగస్థులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చారు. తేలికగా, తుప్పు పట్టకుండా ఉండే 'హెచ్‌పీ నవ్య' సిలిండర్‌లో ట్రాన్స్‌పరెంట్ బాడీ ఉండటంతో గ్యాస్ నిల్వను సులభంగా తెలుసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేకపోయినా మొదటిసారి కొత్త సిలిండర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉండగా, తర్వాతి ఆర్డర్లు రీఫిల్‌గా పరిగణించి ఖాళీ సిలిండర్‌ను తీసుకుని కొత్తది అందజేస్తారు. అన్ని డెలివరీలను హెచ్‌పీసీఎల్ అధీకృత డీలర్లు, శిక్షణ పొందిన సిబ్బంది భద్రతా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఈ భాగస్వామ్యంతో కిరాణా వస్తువులకే పరిమితమైన క్విక్ కామర్స్ ఇప్పుడు గృహ అవసరాల వంటి కీలక యుటిలిటీ సేవల్లోకి కూడా విస్తరిస్తోందని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేష్ ఝా పేర్కొన్నారు.






