Swiggy: 100 రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న స్విగ్గీ

by S Gopi |

రాబోయే నెలల్లో ఫుడ్‌తో పాటు కిరాణా వస్తువుల డెలివరీలను సైతం దేశంలోని మరిన్ని స్టేషన్‌లకు విస్తరిస్తామని స్పష్టం చేసింది

Swiggy: 100 రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో సేవలను విస్తరించినట్టు శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో దేశంలోని 20 రాష్ట్రాల్లో ఉన్న 100 రైల్వే స్టేషన్లకు ఫుడ్ డెలివరీ అందిస్తున్నామని తెలిపింది. రాబోయే నెలల్లో ఫుడ్‌తో పాటు కిరాణా వస్తువుల డెలివరీలను సైతం దేశంలోని మరిన్ని స్టేషన్‌లకు విస్తరిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో స్విగ్గీ కొన్ని స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోంది. ఎన్నో ఏళ్లుగా భారత సంస్కృతిలో భాగమైన రైల్వే ప్రయాణంలో సౌకర్యంతో పాటు ఆహారం కూడా ముఖ్యమే. దీన్ని మరింత ఫలవంతం చేస్తూ స్విగ్గీ ఫుడ్ డెలివరీలను 100 స్టేషన్లకు విస్తరించాం. దేశవ్యాప్తంగా అనేక రకాల భోజనాలను రైల్వే ప్రయాణీకులకు అందుబాటులో ఉంచామని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ వెల్లడించారు. రైళ్లలో ఆహారాన్ని డెలివరీ చేయడానికి 2024, మార్చిలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో స్విగ్గీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ఫుడ్ డెలివరీ సేవల కంపెనీ జొమాటో సైతం ఇవే తరహా సేవలను ప్రారంభించింది.

Next Story