Swiggy: స్విగ్గీ కో-ఫౌండర్ నందన్ రెడ్డి రాజీనామా

by S Gopi |

'హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్', 'హోల్-టైమ్ డైరెక్టర్' పదవులకు కూడా రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు.

Swiggy: స్విగ్గీ కో-ఫౌండర్ నందన్ రెడ్డి రాజీనామా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సహ-వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి సంస్థలో తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. సొంత ప్రాజెక్టులను నిర్వహించేందుకు కంపెనీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఆయన తన రాజీనామాలో పేర్కొన్నారు. 'హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్', 'హోల్-టైమ్ డైరెక్టర్' పదవులకు కూడా రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్విగ్గీ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో స్విగ్గీ డైరెక్టర్ల బోర్డులో జరిగిన అప్‌డేట్ల వివరాలను వెల్లడించింది. అందులో నందన్ రెడ్డి రాజీనామాతో పాటు మరో కో-ఫౌండర్ ఫణి కిషన్, గ్రూప్ సీఎఫ్ఓ రాహుల్ బోత్రాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి కంపెనీ ఆమోదించింది. వీరి బాధ్యతలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇదే సమయంలో స్విగ్గీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని మరింత వినియోగించడం, తద్వారా కంపెనీని లాభాల బాటలోకి తీసుకురావడంపై బోర్డు చర్చించినట్టు తెలుస్తోంది.

Next Story