Suzuki: రూ. 18 వేల వరకు ధరలు తగ్గించిన సుజుకి మోటార్‌సైకిల్

by S Gopi |

జీఎస్టీ సంస్కరణలో భాగంగా ధరలను తగ్గించినట్టు ప్రకటించింది.

Suzuki: రూ. 18 వేల వరకు ధరలు తగ్గించిన సుజుకి మోటార్‌సైకిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూ-వీలర్ కంపెనీ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా శుక్రవారం జీఎస్టీ సంస్కరణలో భాగంగా ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. తన అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ. 18,024 వరకు తగ్గించినట్టు తెలిపింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా అందిస్తామని కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సవరించిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ద్విచక్ర వాహనాలతో పాటు, విడిభాగాలు, ఇతర పరికరాలపై తగ్గిన జీఎస్టీతో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఇది పరిశ్రమలో డిమాండ్ పెరుగుదలకు వీలు కల్పిస్తుందని కంపెనీ వైస్-ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ దీపక్ ముత్రేజా అన్నారు. పండుగ సీజన్‌ సమయంలో ధరల తగ్గింపు వల్ల కస్టమర్ల సెంటిమెంట్‌ మరింత పెరుగుతుందని, అందుకే తమ పోర్ట్‌ఫోలియోలోని వాహనాలు ఆకర్షణీయంగా మారుతాయి, మొత్తంగా టూవీలర్ వాహన మార్కెట్లో గిరాకీకి ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story