Adani: జైప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలులో అదానీకి గ్రీన్ సిగ్నల్

by S Gopi |

ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

Adani: జైప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలులో అదానీకి గ్రీన్ సిగ్నల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జైప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలు వ్యవహారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కికి గ్రీన్ సిగ్నల్ లభించింది. దివాళా ప్రక్రియలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (జేఏఎల్) కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ వేసిన రూ. 14,543 కోట్ల బిడ్‌పై మధ్యంతర స్టే ఇవ్వాలని మైనింగ్ దిగ్గజం వేదాంత చేసిన సవాలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. వేదాంతతో పాటు ఇతర పక్షాలు తమ వాదనలను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) ముందు వినిపించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి తుది విచారణ ఏప్రిల్ 10న ఎన్‌సీఎల్ఏటీ చేపడుతుందని, ఈ దశలో జోక్యం చేసుకోవడంలో కారణం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో ఈ విషయాన్ని ఔట్-ఆఫ్-టర్న్ పద్ధతిలో విచారించాలని కోర్టు ట్రిబ్యునల్‌కు సూచించింది. ఒక రోజులో వాదనలు పూర్తవకపోతే, విచారణను తర్వాతి పనిరోజు కొనసాగించాలని కోర్టు తెలిపింది.

Next Story