- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా కుంభమేళాలో భక్తులకు ప్రసాదం వడ్డించిన సుధామూర్తి
by Yella Dhawani Reddy |
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజసభ్య ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాను సందర్శించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజసభ్య ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళాను సందర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం స్థానిక ఇస్కాన్ క్యాంప్‌ను సందర్శించి భక్తులకు స్వయంగా మహా ప్రసాదాన్ని వడ్డించారు. సుధామూర్తి తొలుత ఇస్కాన్(Iskcon) కిచెన్‌కు వెళ్లిన అక్కడి సిబ్బందితో భోజన తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మహా కుంభమేళా(Maha Kumbh 2025)ను ఆమె 'తీర్థరాజ్'గా అభివర్ణించారు. తన పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు కుంభమేళాకు వచ్చినట్లు తెలిపారు.
Next Story






