- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 418 పాయింట్లతో కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 418 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లకు పడిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు డే ప్రారంభంలోనే భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. ఉదయం 9.30కి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ (BSE) సెన్సెక్స్ ఏకంగా 418 పాయింట్లు పతనమై 73,683 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది. ట్రేడింగ్ మొదలైన కాసేపటికే నిఫ్టీ (NIFTY) 90 పాయింట్ల నష్టంతో 22,877 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి 17 పైసలు నష్టపోయి 93.07 వద్ద ట్రేడ్ అవుతోంది.
పతనానికి కారణాలు ఇవే..
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే ఈ పతనానికి ప్రధాన కారణం. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోతుండటంతో సూచీలు కోలుకోలేకపోతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతుండటం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.






