- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market Crash : దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే... 10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)కు శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా మిగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Markets)కు శుక్రవారం బ్లాక్ ఫ్రైడేగా మిగిలింది. ఏకంగా 10 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరవడంతో మార్కెట్స్ భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 1414 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 420 పాయింట్లు నష్టపోయి 22,124కు పడిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్ సూచీలు భారీగా పడిపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలో కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్స్(Asia Markets) లో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లు విపరీతమైన నష్టాల్లో ముగియగా.. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ షేర్లు విపరీతంగా నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 73 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. బంగారం ఒక ఔన్స్ 2874 డాలర్ల వద్ద ఉంది. అయితే ట్రంప్(Trump) అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రకటనలు మదుపర్లలో ఆందోళన కారణమయ్యి ఈ నష్టాలు జరుగుతున్నాయి. దేశీయ బ్యాంకుల 4th క్వార్టర్లీ ఫలితాలు బలహీనంగా నమోదు కావచ్చన్న అంచనాలు కూడా ఈ నష్టాలకు ఒక కారణం అంటున్నారు నిపుణులు.






