స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు.. సరికొత్త రికార్డు స్థాయిలకు సెన్సెక్స్, నిఫ్టీ

by Malleboina Mahesh |

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద సెన్సెక్స్, 24,102 దాటిన నిఫ్టీ!

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు.. సరికొత్త రికార్డు స్థాయిలకు సెన్సెక్స్, నిఫ్టీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) సోమవారం సరికొత్త రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతకు తోడు దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 291.17 పాయింట్లు లాభపడి 77,094.07 వద్ద స్థిరపడింది.

అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) సైతం 89.80 పాయింట్లు పుంజుకుని 24,102.90 మార్కు వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై అంచనాలు, బలమైన ఆర్థిక వృద్ధి సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Next Story