Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

by Maddikunta Saikiran |

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో లాభాల్లో మొదలైన మార్కెట్లు చివరికి నష్టాల్లోకి జారుకుంది. కాగా చైనా, కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మన బెంచ్ మార్క్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80, 415.47 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,482.36 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 105.79 పాయింట్ల నష్టంతో 80,004.06 వద్ద స్థిరపడింది. మరోవైప్పు నిఫ్టీ(Nifty) సైతం 27.40 పాయింట్లు తగ్గి 24,194.50 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.33కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్

నష్టాల్లో ముగిసిన షేర్లు : అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా

Next Story