Stock Market: మోస్తరు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

by Maddikunta Saikiran |

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(గురువారం) ఉదయం మోస్తరు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock Market: మోస్తరు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(గురువారం) ఉదయం మోస్తరు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి పాజిటివ్ సిగ్నల్స్(Positive Signals) రావడం, రేపు రిజర్వ్ బ్యాంక్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవరిస్తున్నారు. దీంతో మన బెంచ్ మార్క్ సూచీలు ఫ్లాట్(Flat)గా కదులుతున్నాయి. ఎర్లీ సెషన్లో సెన్సెక్స్(Sensex) 155 పాయింట్ల లాభంతో 81,112 వద్ద, నిఫ్టీ(Nifty) 41 పాయింట్ల లాభంతో 24,510 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 84.71 వద్ద కొనసాగుతుంది. మరోవైపు బిట్ కాయిన్(Bitcoin) వాల్యూ రికార్డు స్థాయిలో లక్ష డాలర్లు క్రాస్ అయ్యింది. నిఫ్టీలో హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్ కాగా.. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, నెస్లే టాప్ లూజర్స్.

Next Story