- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 1,132 పాయింట్లకుపైగా సెన్సెక్స్ డౌన్
కొత్త ఆర్థిక సంవత్సరం వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాలతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లలో ఆచుతూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 200 పాయింట్లకు పడిపోయింది. ప్రముఖ సంస్థలు ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా షేర్లు ప్రాఫిట్‌లో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సమయం 11.15 దాటేసరికి సెన్సెక్స్ (Sensex) 1,132 పాయింట్ల నష్టంతో 76,281 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 286 పాయింట్ల నష్టంతో 23,233 వద్ద ట్రేడ్ అవుతోంది.






