- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించిన ఎస్‌బీఐ
దీనికి సంబంధించిన చెక్కును బ్యాంకు ఛైర్మన్ సీ ఎస్ శెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్‌బీఐ రూ. 8,076.84 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. దీనికి సంబంధించిన చెక్కును బ్యాంకు ఛైర్మన్ సీ ఎస్ శెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు, ఆర్థిక కార్యదర్శి అజయ్ సేథ్ కూడా పాల్గొన్నారు. ఎస్‌బీఐ డివిడెండ్ చెల్లించిన విషయాన్ని ఆర్థిక మంత్రి కార్యాలయ వర్గాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ ఒక్కో షేరుకు రూ. 15.90 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇచ్చిన ఈక్విటీ షేరుకు రూ. 13.70 కంటే ఎక్కువ. దీని ప్రకారం, గత సంవత్సరం ఎస్‌బీఐ ప్రభుత్వానికి రూ. 6,959.29 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రికార్డు స్థాయిలో రూ. 70,901 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కారణంగా డివిడెండ్ చెల్లింపు కూడా భారీగానే పెరిగింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ. 61,077 కోట్ల కంటే 16 శాతం అధికం.






