Star-Labelling : రిఫ్రిజిరేటర్, టీవీ, ఎల్పీజీ స్టవ్ సహా గృహోపకరణాలకు స్టార్ రేటింగ్ తప్పనిసరి

by S Gopi |

ఈ ఆదేశాలు 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

Star-Labelling : రిఫ్రిజిరేటర్, టీవీ, ఎల్పీజీ స్టవ్ సహా గృహోపకరణాలకు స్టార్ రేటింగ్ తప్పనిసరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: గృహోపరణాలు, ఇతర ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు సహా గృహోపకరణాలపై ఎనర్జీ ఎఫిహిషియన్సీ స్టార్-లేబులింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్-లేబులింగ్ కోసం తప్పనిసరి అయిన ఉత్పత్తుల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారని ఓ అధికారి తెలిపారు. అంతేకాకుండా ఈ కొత్త నిబంధన డీప్ ఫ్రీజర్‌లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, గ్రిడ్ కనెక్ట్ సోలార్ ఇన్వర్టర్‌లకు కూడా వర్తిస్తుంది. గతంలో, ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్లు, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రీజర్‌లు, ఆర్ఏసీ (క్యాసెట్, ఫ్లోర్ స్టాండింగ్ టవర్, సీలింగ్, కార్నర్ ఏసీ), కలర్ టెలివిజన్లు, అల్ట్రా-హై డెఫినిషన్ టెలివిజన్‌లు వంటి వాటిపై స్టార్ లేబులింగ్ స్వచ్ఛందంగా ఉండేది. ఈ గృపకరణాలకు ఇప్పటికే స్టార్ లేబులింగ్ తప్పనిసరి అయినప్పటికీ, వీటిని మరింత ఎనర్జీ ఎఫిషియన్సీగా మార్చడానికి ప్రమాణాలను అప్‌గ్రేడ్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు.

Next Story