SC, STలకు రూ.10 లక్షల నుండి కోటి రూపాయల లోన్ ఇచ్చే ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేసుకోండి

by Ajay Maddhiboyina |

షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన కులాలవారి ఆర్థిక స్వాలంబన కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకువచ్చింది. అలాంటి పథకాల్లో స్టాండప్ ఇండియా పథకం కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు వ్యాపారం చేసుకునేందుకు రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తారు.

SC, STలకు రూ.10 లక్షల నుండి కోటి రూపాయల లోన్ ఇచ్చే ప్రభుత్వ పథకం.. ఇలా అప్లై చేసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన కులాలవారి ఆర్థిక స్వాలంబన కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకువచ్చింది. అలాంటి పథకాల్లో స్టాండప్ ఇండియా పథకం కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు వ్యాపారం చేసుకునేందుకు రూ.10 లక్షల నుండి రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తారు. పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్రం ప్రారంభించింది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ పథకం అమలు కోసం రూ.62,791 కోట్లు మంజూరు చేసినట్టు పార్లమెంట్ లో ప్రకటించారు. ఈ స్కీమ్ కింద బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ మహిళకు లోన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకునేవారు https://www.standupmitra.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవ‌చ్చు. మీరు ప్రారంభించ‌బోయే వ్యాపారానికి 10 నుండి 15 శాతం పెట్టుబ‌డి పెడితే మిగితాది కేంద్రం ద్వారా లోన్ రూపంలో పొందే అవ‌కాశం ఉంది.

ప‌థ‌కానికి అప్లై చేసుకోవాలంటే క‌నీస వ‌య‌సు 18 ఏళ్లు ఉండాలి. ఇక ఇప్ప‌టికే వ్యాపారంలో ఉన్న మ‌హిళ‌లు కూడా ఆ వ్యాపార విస్త‌ర‌ణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అయితే వ్యాపారంలో 51 శాతం వాటా కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ మహిళలపేరు మీద ఉండాలి. సిబిల్ స్కోర్ మంచిగా ఉండటంతో పాటు గతంలో ఎలాంటి లోన్ డీఫాల్టర్ గా ఉండకూడదు. ఇక లోన్ తీసుకున్న తరవాత 18నెలల నుండి 7 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సొంతగా వ్యాపారం చేయాలనుకునేవారు బయట అధిక వడ్డీలకు అప్పు తీసుకోవడం కంటే స్టాండ్ అప్ మిత్రాలో అప్లై చేసుకోవడం చాలా మంచిది.

Next Story