Adani Group: అదానీ విద్యుత్ ప్రాజెక్టులను సమీక్షించేందుకు కమిటీని నియమించిన శ్రీలంక

by S Gopi |

సమీక్ష పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై నిర్ణయించనున్నట్టు ఆయన చెప్పారు.

Adani Group: అదానీ విద్యుత్ ప్రాజెక్టులను సమీక్షించేందుకు కమిటీని నియమించిన శ్రీలంక
X

దిశ, బిజినెస్ బ్యూరో: శ్రీలంకలోని మన్నార్, పూనెరిక్ జిల్లాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీకి ఇచ్చిన విండ్ పవర్ ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఓ కమిటీని నియమించినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టును రద్దు చేశారనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడిన ప్రభుత్వ అధికార ప్రతినిధి నలింద జయతిస్సా.. 2023లో గత ప్రభుత్వం నిర్ణయించిన ధరల ఆధారంగా తీసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయలేదని, వాటిని సమీక్షించేందుకు కమిటీని నియమించాలని నిర్ణయం జరిగింది. సమీక్ష పూర్తయిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై నిర్ణయించనున్నట్టు ఆయన చెప్పారు. గతేడాది మేలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం 484 మెగావాట్ల అదానీ విండ్ ప్లాంట్‌ల కోసం యూనిట్‌కు 0.826 డాలర్ల చొప్పున 20 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతం చేసింది. స్థానిక బిడ్డర్లు తక్కువ ధరకే బిడ్లు వేసినప్పటికీ, అదానీ గ్రూపునకే ప్రాజెక్ట్ అప్పగించడంపై విమర్శలు ఎదురయ్యాయి. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలకు ఏకీభవించలేం. ఫలితంగా మునుపటి ధరల ప్రకారం ఒప్పందం రద్దయింది. ధరలతో పాటు, ప్రాజెక్ట్‌లో మార్పులను సవరించే బాధ్యతలు కమిటీకి అప్పగించినట్టు నలింద జయతిస్సా పేర్కొన్నారు.

Next Story