RBI: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో పొరపాట్లకు ఆర్‌బీఐ చెక్

by S Gopi |

నగదును బదిలీ చేసే సమయంలో అవతలి వ్యక్తి పేరు కనిపించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సోమవారం ప్రకటించింది.

RBI: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో పొరపాట్లకు ఆర్‌బీఐ చెక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ చెల్లింపులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) విధానాల్లో నగదును బదిలీ చేసే సమయంలో అవతలి వ్యక్తి పేరు కనిపించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సర్క్యులర్‌ను విడుదల చేస్తూ.. 2025, ఏప్రిల్ 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, లావాదేవీ జరిగే ముందు నగదు పంపించే వ్యక్తి పేరును వెరిఫై చేసుకుని చెల్లింపులు పూర్తిచేసేందుకు వీలవుతుందని పేర్కొంది. చెల్లింపులకు ముందు బ్యాంకు ఖాతా, బ్రాంచ్ ఐఎఫ్ఎస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సదరు ఖాతాదారు పేరు కనిపిస్తుంది. దీని ద్వారా ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల్లో పొరపాట్లకు, మోసాలకు వీలుండదని స్పష్టం చేసింది. అలాగే, ఈ సదుపాయాన్ని తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌పీసీఐకి సూచించింది. ప్రస్తుతం యూపీఐ, ఐఎంపీఎస్ లాంటి నగదు బదిలీ విధానాల్లో ఇలాంటి సదుపాయం ఉంది. ఇది ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లాంటి వాటిలోనూ విస్తరించనుంది.

Next Story