రూ.2 వేలలోపు ధరలో అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లు

by Disha Web Desk 17 |
రూ.2 వేలలోపు ధరలో అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సైట్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2023 లో భాగంగా వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌వాచ్‌లపై తగ్గింపులు ఉన్నాయి.

Boat Xtend స్మార్ట్‌వాచ్ రూ. 1,798 కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 7,990. ఇది 1.69-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో యూజర్ల హెల్త్ కోసం చాలా ఫీచర్లను అందించారు. ఒత్తిడి పర్యవేక్షణ, హృదయ స్పందన రేటు, SpO2 ట్రాకింగ్ అలాగే నిద్ర పర్యవేక్షణ మొదలగు వాటిని అందిస్తున్నారు. అలాగే, 14 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. నీటి నిరోధకత కోసం 5ATM రేట్ చేయబడింది. ఇన్‌బిల్ట్‌గా అలెక్సా సపోర్ట్‌ కూడా ఉంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.

Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ.1,999. కానీ ఈ సేల్‌లో భాగంగా రూ.1,298 కే అందుబాటులో ఉంది. ఇది 1.83-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో హెల్త్ పరంగా హార్ట్‌బీట్ మానిటర్, SpO2 వంటి ఫీచర్లను కలిగి ఉంది. దమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్ చేయబడింది.

Redmi Smart Band Pro ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో 1.47-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. సేల్‌లో భాగంగా ధర రూ.1,798కే లభిస్తుంది. సాధారణంగా దీని అసలు ధర రూ. 7,990. దీనిలో స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు, ఒత్తిడి, SpO2ని ట్రాకింగ్ ఫీచర్లను అందించారు. ఇది 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం 5ATM రేట్ చేయబడింది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed