- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
amazon: అమెజాన్ సేల్‌లో లభిస్తున్న రూ. 30 వేల లోపు క్రేజీ స్మార్ట్‌ఫోన్‌లు
శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్, రియల్‌మీ లాంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లను ఆఫర్ చేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సేల్‌లో భాగంగా అనేక రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ఇస్తోంది. ముఖ్యంగా ఈ సేల్ సందర్భంగా అమెజాన్ రూ. 30,000 కంటే తక్కువ ధరలో శాంసంగ్, షియోమీ, వన్‌ప్లస్, రియల్‌మీ లాంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లను ఆఫర్ చేస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, స్మార్ట్ టీవీలు వంటి గృహోపకరణాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్‌లకు కూడా డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా పాటు ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ డీల్స్, ఈఎంఐ ప్లాన్‌లు, ప్రత్యేక కూపన్‌లకు కూడా యాక్సెస్ ఉంది. ఈ ఆదర్ల మూలంగా కొనుగోలు చేయాల్సిన ఉత్పత్తుల ధరలు మరింత తక్కువ ధరకు లభిస్తాయి. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 30,000 లోపు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది.
మిడ్-రేంజ్ విభాగంలో టాప్ డీల్స్ చూస్తే.. ఐకూ నియో 10ఆర్ 5జీ ధర రూ. 35,999 ఉండగా, సేల్‌లో రూ. 25,998కే లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ రూ. 45,999 ఉంటే, అమెజాన్ సేల్‌లో రూ. 25,999కి లభిస్తోంది. అలాగే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ5 రూ. 24,999 నుంచి రూ. 23,499కి, ఐకూ జెడ్10 5జీ రూ. 27,999 నుంచి రూ. 22,998కి, ఐకూ జెడ్10 ఆర్ 5జీ రూ. 24,999 ఉంటే, ఈ సేల్‌లో రూ. 21,498కి లభిస్తోంది.






