- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smartphone Exports: స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డులు నమోదు
ఇది గతేడాది కంటే 100 శాతం పెరుగుదల.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు కొత్త రికార్డులు నమోదు చేశాయి. గత నెలలో ఇవి ఏకంగా 1.8 బిలియన్ డాలర్ల(రూ. 15.88 వేల కోట్ల)కు చేరుకున్నాయి. ఇది గతేడాది కంటే 100 శాతం పెరుగుదల. వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గతేడాది ఇదే నెలలోనే కాకుండా గత మూడేళ్లలోనే ఈ స్థాయి పెరుగుదల కనిపించిందని వాణిజ్య శాఖ వెల్లడించింది. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని అమలు చేసిన తర్వాత మనదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల వృద్ధి గణనీయంగా పెరుగుతున్నాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025-26 ప్రథమార్థంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 60 శాతం పెరిగి రూ. 1.19 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 74.1 వేల కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో ఒక్క యాపిల్ ఫోన్ ఎగుమతుల విలువే రూ. 88.25 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇది మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో 75 శాతానికి సమానం.






