- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Finance Ministry: భవిష్యత్తు ఆర్థిక రంగం పూర్తిగా 'ఫిజిటల్ ': నిర్మలా సీతారామన్
యూపీఐ వృద్ధిని ప్రతిబింబించాలని ఫిన్‌టెక్ కంపెనీలకు పిలుపునిచ్చారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ ఆర్థిక రంగ భవిష్యత్తు భౌతిక, డిజిటల్ సేవల మిశ్రమంగా 'ఫిజిటల్'గా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఫిన్‌టెక్ కంపెనీలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. డిజిటల్ క్రెడిట్ డెలివరీని క్రమబద్ధీకరించడానికి, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వృద్ధిని ప్రతిబింబించాలని ఫిన్‌టెక్ కంపెనీలకు పిలుపునిచ్చారు. ఈ చర్య దేశంలోని మారుమూల ప్రాంతాలలో కొత్త మార్కెట్‌లను అన్‌లాక్ చేస్తుందని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) వృద్ధిని ఉత్ప్రేరకంగా, అన్ని ప్రాంతాల్లో ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని అన్నారు. యూపీఐ తరహాలో ఇప్పుడు డిజిటల్ రుణాల కోసం ఏకీకృత లెండింగ్ ఇంటర్‌ఫేస్ వైపు అడుగులు వేస్తున్నామని సీతారామన్ తెలిపారు. ప్రతి ఫిన్‌టెక్ కంపెనీ గ్రామీణ ప్రాంతాన్ని కొత్త మార్కెట్ అవకాశంగా చూడాలి, ఎందుకంటే డిమాండ్ పెరిగే వీలుంటుందన్నారు. దేశంలో భవిష్యత్ ఫైనాన్స్ ఫిజిటల్‌గా ఉంటుందని తెలిపారు. దేశ ఫిన్‌టెక్ మార్కెట్ 2028-29 నాటికి ప్రతి సంవత్సరం 30 శాతం వృద్ధితో 400 బిలియన్ డాలర్ల(రూ. 34.6 లక్షల కోట్ల)కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.






