- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FDIs: వరుసగా 7వ సారి భారత అతిపెద్ద ఎఫ్‌డీఐ దేశంగా సింగపూర్
ప్రపంచంలో పెట్టుబడులకు సురక్షితమైన, కీలకమైన దేశంగా భారత్ అవతరించే ధోరణిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు)కు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్ కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం మనదేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐ 50 బిలియన్ డాలర్లు (రూ.4.28 లక్షల కోట్లకు పైగా)కు చేరుకున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) వెల్లడించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 13 శాతం అధికమని తెలిపింది. ప్రపంచంలో పెట్టుబడులకు సురక్షితమైన, కీలకమైన దేశంగా భారత్ అవతరించే ధోరణిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో సింగపూర్ వరుసగా ఏడోసారి అతిపెద్ద ఎఫ్‌డీఐ దేశంగా అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈక్విటీలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే నిధులు కలిగిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం 14 శాతం పెరిగి 81.04 బిలియన్ డాలర్ల(రూ. 6.93 లక్షల కోట్ల)కు చేరాయి. విదేశీ పెట్టుబడులు దేశంలో మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులను మెరుగుపరిచేందుకు చాలా కీలకం. అంతేకాకుందా దేశ చెల్లింపులను ఇతర ప్రపంచ కరెన్సీలతో సమతుల్యం చేసేందుకు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను పెంచడంలో ఎఫ్‌డీఐలు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024-25లో సింగపూర్ నుంచి 14.94 బిలియన్ డాలర్ల(రూ. 1.28 లక్షల కోట్ల)కు పెరిగాయి. అంతకుముందు 2023-24లో 11.77 బిలియన్ డాలర్లు(రూ. లక్ష కోట్లు)గా నమోదయ్యాయి. మొత్తం ఎఫ్‌డీఐ నిధుల్లో ఒక్క సింగపూర్ మాత్రమే 19 శాతం వాటా అందించింది. 2018-19 నుంచి భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అంతకుముందు మారిషస్ ఉండేది. ఈసారి మారిషష్ రూ. 71.35 వేల కోట్ల ఎద్‌డీఐలను తీసుకొచ్చింది.
మారిషస్ తర్వాత, అమెరికా రూ. 46.67 వేల కోట్లు, నెదర్లాండ్స్ రూ. 39.5 వేల కోట్లు అందించాయి. యూఏఈ(రూ.27 వేల కోట్లు), జపాన్(రూ. 21.13 వేల కోట్లు), సైప్రస్(రూ. 10.02 వేల కోట్లు), యూకే(రూ. 6,802 కోట్లు), జర్మనీ(రూ. 4,012 కోట్లు), కేమన్ దీవులు(రూ. 3,175 కోట్లు) వచ్చాయి. ప్రపంచ ఆర్థిక కేంద్రంగా సింగపూర్ ప్రాముఖ్యత, భారత్‌తో ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఈ పెట్టుబడులకు కీలకంగా నిలిచాయని నిపుణులు భావిస్తున్నారు.






