BREAKING: రూ.3.50 లక్షల దిశగా వెండి పరుగులు.. ఒక్కరోజే రూ.12000 పెరుగుదల

by Naga Rani Yarlagadda |

బంగారమే కాదు.. వెండి కూడా ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందని చెప్పాలి. ఊహకందని రీతిలో వెండి ధర రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.

BREAKING: రూ.3.50 లక్షల దిశగా వెండి పరుగులు.. ఒక్కరోజే రూ.12000 పెరుగుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారమే కాదు.. వెండి కూడా ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందని చెప్పాలి. ఊహకందని రీతిలో వెండి ధర రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. వెండికి ఉన్న డిమాండ్ తో పాటు.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 5G, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగం వేగంగా పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో కిలో వెండి ధర రూ.24వేలు పెరిగింది. ఈ ఒక్కరోజే రూ.12000 ధర పెరిగి.. హైదరాబాద్ లో కిలో సిల్వర్ రేటు రూ.3,30,000కు చేరింది.

బంగారం రేటు కూడా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,000కు చేరువలో ఉంది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1040 పెరిగి రూ.1,47,280కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.950 పెరిగి రూ.1,35,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఇలాగే ఉండనున్నాయి. వచ్చే నెల నుంచి శుక్ర మౌఢ్యమి పూర్తయి పెళ్లిళ్లు ప్రారంభం కానుండగా.. వెండి, బంగారం ఆభరణాలకు మరింత డిమాండ్ పెరగనుంది. ఈ క్రమంలో వెండి, బంగారం ధరలు ఆకాశానికి తాకుతాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story