- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంట వ్యవధిలో భారీగా వెండి రేటు ఢమాల్
కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధర ఒక గంటలోనే భారీగా పతనమైంది. 2026లో వెండిధర మరింత తగ్గుతుందని సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధర ఒక్క గంటలోనే రూ.21 వేలు పతనమైయింది. నాన్ స్టాప్ గా పెరిగిన వెండి 2 లక్షల 50 వేల రూపాయలు దాటడంతో.. ఇంకెప్పుడు తగ్గుతుందా అని కొనుగోలు దారులు ఎదురుచూశారు. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్ కిలో వెండి ధర గంటలో రూ.21 వేలు తగ్గడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు రూ.2,54,174 నుంచి రూ.2,33,120కి తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కరణంగా.. వెండి రేటు భారీగా దిగొచ్చింది.
వెండి ధర భారీగా పతనమవ్వడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో కీలక అడుగు పడింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి తెరపడుతుందన్న అంచనాలు బలపడటంతో వెండి ధర పతనమైంది. దీంతోపాటు చికాకూ మర్చంట్ ఎక్స్ఛేంజీ కూడా వెండి పతనానికి మరో కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను బట్టి 2026 జనవరిలో వెండి రేటు క్రమంగ తగ్గే అవకాశాలున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే చర్చలు సఫలమైతే వెండి రేటు మరింత తగ్గుతుందన్న వాదన కూడా ఉంది.






