భారీగా పెరిగిన వెండి రేటు

by Naga Rani Yarlagadda |

గురువారం ఉదయం భారీగా తగ్గిన వెండి ధర.. మధ్యాహ్నానికి ఊహించని విధంగా పెరిగింది.

భారీగా పెరిగిన వెండి రేటు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కానీ.. మధ్యాహ్నానికి వెండి ధర ఊహించని రీతిలో పెరిగి కొనుగోలు దారులకు షాకిచ్చింది. ఉదయం రూ.15 వేలు తగ్గిన వెండి రేటు.. మధ్యాహ్నానికి రూ.10,000 పెరిగింది. అనూహ్యంగా వెండి ధర పెరగడంతో కొనుగోలు దారులు షాకయ్యారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రేటుకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. వెండి ధర తగ్గుతుండటంతో.. ఇన్వెస్టర్లు దానిపై ఆసక్తి చూపడం వల్లే రేటు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలతో కలిపి రూ.1,80,031గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,65,022గా ఉంది.

Next Story