Gold: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం

by S Gopi |

ఈ సంఘర్షణల కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతుండటంతో వచ్చే వారం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.

Gold: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతితో అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేశారు. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ వెండి, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సంఘర్షణల కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతుండటంతో వచ్చే వారం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల మధ్య పరిస్థితి మరింత అనిశ్చితంగా మారుతున్నందున, మదుపర్లు సురక్షితమైన సాధనాలకు నిధులను తరలిస్తారు. మరోవైపు, భౌగోళిక ప్రతికూల పరిస్థితులతో మార్కెట్లు అస్థిరంగా మారనున్నాయి. దీనివల్ల కూడా విలువైన లోహాలకు గిరాకీ పెరగనుందని విశ్లేషకులు తెలిపారు. దేశీయంగా ఇప్పటికే బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్టాలకు చేరాయి. గతవారం కూడా బంగారం ఫ్యూచర్స్ భారీగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఆందోళనలు పెరిగేకొద్దీ పెట్టుబడిదారులు రిస్క్ నుంచి రక్షణ దిశగా పెట్టుబడులను తరలిస్తారు. ఈ ధరల పెరుగుదల మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. సంఘర్షణ తీవ్రమైతే, విలువైన లోహాలకు డిమాండ్ బలంగా మారి, బులియన్ ధరలను పెంచుతూనే ఉంటాయి. ఏవైనా ఊహించని దౌత్య పరిణామాలు జరిగితే ఈ ధోరణిలో మార్పు ఉంటుందని విశ్లేషకులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం దేశీయంగా ధరలు స్వచ్ఛమైన పసిడి రూ. 1,73,080 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1,58,650 వద్ద ఉంది. వెండి కిలో రూ. 2,95,000 వద్ద ఉంది.

Next Story