Silver: రూ. 2.20 లక్షలు దాటిన వెండి

by S Gopi |

ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి గిరాకీ ఎక్కువగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.

Silver: రూ. 2.20 లక్షలు దాటిన వెండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒక్కరోజు గ్యాప్ తర్వాత వెండి ధరలు మరోసారి రికార్డు గరిష్టాలకు చేరాయి. అంతర్జాతీయ పరిణామాలు బలంగా ఉండటం, సరఫరా ఆందోళనలు కొనసాగడం, వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల మధ్య ధరలు అమాంతం ఊపందుకున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు సంబంధించి ఇన్వెస్టర్లు గురువారం విడుదలయ్యే నవంబర్ నెల డేటా కోసం, శుక్రవారం వెలువడే వ్యక్తిగత వినియోగ వ్యయం డేటా కోసం ఎదురుచూస్తున్న క్రమంలో విలువ లోహాలపై దృష్టి సారించారు. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి గిరాకీ ఎక్కువగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. దేశీయంగా కూడా గిరాకీతో పాటు పారిశ్రామిక వినియోగం పెరగడం వంటి పరిణామాల వల్ల కొత్త గరిష్ఠాలకు చేరుతోంది. బుధవారం వెండి కిలో ఏకంగా రూ. 11,000 పెరిగి రూ. 2.22 లక్షల మార్కుకు చేరాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి ధరలు రూ. 87,578 నుంచి రూ. 1,18,533 లేదా 135.34 శాతం పెరిగాయి. మరోవైపు, గోల్డ్ ఫ్యూచర్స్ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 650 పెరిగి రూ. 1,34.510 వద్ద ఉన్నాయి. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 600 పుంజుకుని రూ. 1,23,300కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలలోనూ ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్లు 13.1 డాలర్లు పెరిగి, ఔన్స్‌కు 4,345.1 డాలర్లకు చేరుకున్నాయి.

Next Story