Silver Price : మెరిసిన వెండి.. హైదరాబాద్‌లో ఆల్ టైం రికార్డు ధర

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) మార్కెట్‌లో వెండి ధర(Silver Price) ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

Silver Price : మెరిసిన వెండి.. హైదరాబాద్‌లో ఆల్ టైం రికార్డు ధర
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) మార్కెట్‌లో వెండి ధర(Silver Price) ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,14,000 పలికింది. ఒక్క రోజులోనే రూ.3,016 పెరిగడం గమనార్హం. పారిశ్రామిక, ఆభరణ రంగాల్లో వినియోగం పెరగడం, దిగుమతి ఖర్చులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో భారత్ లో వెండి ధరలు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు ఔన్స్‌కు $30.22 గా ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం. ఇక హైదరాబాద్‌లో వెండి ఆభరణాలు, నాణేలు, బులియన్‌ల రూపంలో పెట్టుబడులు పెడుతుండటంతో డిమాండ్ పెరిగింది.

పండుగల సీజన్, ఎలక్ట్రానిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, 5G టెక్నాలజీలో వెండి వాడకం డిమాండ్‌ మరింత పెరిగాయి. దీనితో కమోడిటీ మార్కెట్‌లో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. MCX, NCDEX లాంటి కమోడిటీ ఎక్స్చేంజీలలో వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా ఊపందుకోవడంతో హైదరాబాద్‌తో సహా భారత్‌లో వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.

Next Story