Food delivery apps: స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఛార్జీల మినహాయింపులు ఉండవు!

by Yella Dhawani Reddy |

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలై స్విగ్గీ, జొమాటోలు తమ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పాయి.

Food delivery apps: స్విగ్గీ, జొమాటో కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆ ఛార్జీల మినహాయింపులు ఉండవు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ (Food Deliveries) సంస్థలై స్విగ్గీ (Swiggy), జొమాటోలు (Zomato) తమ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పాయి. ఇప్పటివరకు తమ కస్టమర్లకు స్పెషల్ లాయల్టీ ప్రోగ్రాం కింద అందిస్తున్న సర్ ఛార్జ్ (Surcharge) సౌకర్యాన్ని నిలిపివేశాయి. ఇకపై జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ మెంపర్ షిప్ కలిగిన యూజర్లు సైతం వర్షం సమయంలో లేదా ఇతర ప్రత్యేక పరిస్థితులలో ఫుడ్ ఆర్డర్ చేస్తే అదనపు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

స్విగ్గీ, జొమాటో కంపెనీలు గతంలో లాయల్టీ ప్రోగ్రాం కింద ఉన్న కస్టమర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్ డెలివరీని అందించాయి. అయితే, ఈ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జొమాటో కేవలం రూ.39 కోట్ల లాభాన్ని మాత్రమే ప్రకటించింది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 78 శాతం తక్కువగా ఉంది. అలాగే, స్విగ్గీ సైతం భారీగా నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండు సంస్థలు తమ ఆదాయాలను పెంచుకుని నష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఆర్డరుపై ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Next Story