- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICICI బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. సేవింగ్స్ ఖాతాలో రూ.50 వేలు ఉండాల్సిందే
దేశంలో రెండో అతిపెద్ద కార్పొరేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రెండో అతిపెద్ద కార్పొరేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం కస్టమర్ బేస్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. తమ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లు కలిగిన ఖాతాదారుల మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్లకు ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ఖాతాలు తెరిచిన వారు మెట్రో, పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంచారు. గతంలో ఆ పరిమితి రూ.10 వేలుగా ఉండేది. ఇక సెమీ అర్బన్ పట్టణాల్లో మినిమన్ బ్యాలెన్స్ రూ.25 వేలుగా నిర్ణయించారు. అంతకు ఆ పరిమితి రూ.5 వేలుగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారుల మినిమమ్ బ్యాలెన్స్ ఇక రూ.10 వేలుగా డిసైడ్ చేశారు. గతంలో ఆ లిమిట్ రూ.5 వేలుగా ఉండేది. ఒకవేళ ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయని పక్షంలో 6శాతం లోటుతో రూ.500 జరిమానా విధించబడుతుంది. తాజాగా ఐసీఐసీఐ తెచ్చిన నిబంధన చూసి ఖాతాదారులు ఖంగుతింటున్నారు. నెల తిరగక ముందే ఖాతా ఖాళీ అవుతోన్న వేళ ఈ నిబంధనలు ఏంట్రా బాబు.. అని గగ్గోలు పెడుతున్నారు.






