- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance Retail: ప్రపంచ ఫ్యాషన్ ఎగుమతి కేంద్రంగా భారత్
అమెరికా, యూకే సహా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ప్రణాళికను ఇరు కంపెనీలు సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్ రంగంలో భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో దేశీయ అతిపెద్ద రిలయన్స్ రిటైల్, గ్లోబల్ బ్రాండ్ షీన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే 6-12 నెలల్లో దేశంలో షీన్-బ్రాండెడ్ దుస్తులను స్థానిక అమ్మకాల కోసం మాత్రమే కాకుండా, అమెరికా, యూకే సహా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ప్రణాళికను ఇరు కంపెనీలు సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. సింగపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్ షీన్, మనదేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2026 మధ్య నాటికి భారతీయ గార్మెంట్ తయారీదారుల నెట్‌వర్క్‌ను 150 నుంచి 1,000కి పెంచడానికి కంపెనీలు పోటీ పడతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఫ్యాషన్ రిటైలర్లు చైనాపై ఆధారపడకుండా భారత మార్కెట్లో తయారీ, సరఫరా, అమ్మకాలు, కార్యకలాపాల బాధ్యతను చేపట్టాలని షీన్, రిలయన్స్ భావిస్తున్నాయి. షీన్ బ్రాండ్ తొలిసారి 2018లో భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. కానీ సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా-సంబంధిత యాప్‌లపై నిషేధం కారణంగా 2020లో షీన్ యాప్ నిషేధానికి గురైంది. తిరిగి 2025లో రిలయన్స్‌తో భాగస్వామ్యం ద్వారా షీన్ఇండియా.ఇన్‌ను నిర్వహించేందుకు లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. తద్వారా షీన్ బ్రాండ్ మళ్లీ మన మార్కెట్లోకి అడుగుపెట్టింది.






